ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? రోజంతా ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నారా? అయితే వెయిట్ లిఫ్టింగ్ ను దినచర్యలో భాగం చేసుకోండి. ఆరోగ్యంతోపాటు జీవితకాలమూ పెంచుకోవచ్చు. అదెలాగ అంటారా.. ఈస్టోరీని చదవండి...
కండరాల బలహీనత వల్ల త్వరగా అనారోగ్య సమస్యలు వస్తాయంటారు. డాక్టర్లు. దీనికి నివారణగా రెగ్యులర్ ఎక్షర్ సైజ్ చేయడంతోపాటు బరువులు ఎత్తాలి. బరువులు ఎత్తడం వల్ల కండరాలపై ప్రభావం పడుతుంది. కండరాలు బలంగా తయారవుతాయి.
Also Read :- చలికాలంలో పిల్లలకు ఎలర్జీలు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
ఆరోగ్యమే కాదు ఆయుష్ కూడా పెరుగుతుంది. అమెరికా, రష్యా సైంటిస్టులు కూడా ఇదే విషయం చెప్తున్నారు. అక్కడి వృద్ధుల జీవనశైలిని పరిశీలించాకే ఈ విషయం తేల్చారు. రెగ్యులర్గా వెయిట్ లిఫ్టింగ్ చేసే సీనియర్ సిటిజన్స్ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారట. తరచుగా జరువులు ఎత్తడం వల్ల కండరాలకు శక్తివస్తుంది. వృద్ధాప్య ఛాయలనూ తగ్గిస్తుంది.
రన్నింగ్, జాగింగ్ చేసేవాళ్లు వెయిట్ లిఫ్టింగ్ పై ఫోకస్ చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. సో… ఇంకెందుకు ఆలస్యం రోజువారి వ్యాయామాలతో పాటు బరువు కూడా ప్రయారిటీ ఇవ్వండి .
–వెలుగు, లైఫ్–