మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున.. ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా లైసెన్స్ ఉన్న ఆయుధాలన్నింటినీ పోలీస్ స్టేషన్‌లలో అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు పోలీసులు .
ఈ క్రమంలో గ్వాలియర్-చంబల్ డివిజన్‌లలో ప్రజలు ఉదయం నుంచి పోలీస్ స్టేషన్‌ల ముందు భారీగా బారులు దీరారు. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రజలు తుపాకులను బాగా వాడుతారు. వారు వాటిని వివాహాల వంటి సందర్భాలలో లేదా ఏదైనా ఫంక్షన్లలో తమ భుజాలపై మోస్తారు.
Also Read :- పార్టీకి అంబులెన్స్ లో జూనియర్ డాక్టర్లు
గ్వాలియర్ చంబల్ ప్రాంతంలో లక్షకు పైగా లైసెన్స్ పొందిన తుపాకులు ఉన్నాయి, ఇవి మొత్తం మధ్యప్రదేశ్‌లోనే అత్యధికం కావడం గమనార్హం. ఈ ప్రాంతంలోని దాదాపు అన్ని ఇళ్లలో లైసెన్సు తుపాకులు ఉన్నాయి. అక్కడ ఏదైనా గొడవ జరిగితే ప్రజలు తమ తుపాకీలను బయటకు తీసి కాల్చడం ప్రారంభిస్తారు.
కాగా 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 2023 నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి