దేశీయంగా రూపొందించిన దీర్ఘ శ్రేణి గ్లైడ్ బాంబు గౌర్వను ఒడిశా తీర ప్రాంతంలో వాయుసేనకు చెందిన ఎస్ఈయూ–30 ఎంకే–ఐ యుద్ధ విమానం నుంచి డీఆర్డీవో తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. దీన్ని ప్రయోగించగా లాంగ్ వీలర్ దీవిలో ఉంచి లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.
గౌరవ్‌ను హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ రూపొందించి అభివృద్ధి చేసింది. గౌరవ్ అనేది గాలిలో ప్రయోగించే 1000 కిలో క్లాస్ గ్లైడ్ బాంబు, ఇది సుదూర లక్ష్యాలను ఛేదించగలదు. ప్రయోగించిన తర్వాత ఈ గ్లైడ్ బాంబు ఐఎన్ఎస్, జీపీ డేటా కలయికతో అత్యంత కచ్చితమైన హైబ్రిడ్ నావిగేషన్ స్కీమ్‌ను ఉపయోగించి లక్ష్యం వైపు పయనిస్తుంది.