అజయ్ దేవగణ్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సింగమ్ ఎగైన్’. కరీనా కపూర్ హీరోయిన్. సోమవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. దాదాపు ఐదు నిమిషాల నిడివితో, తన మార్క్ యాక్షన్ సీక్వెన్సులతో ట్రైలర్ కట్ చేశాడు డైరెక్టర్ రోహిత్ శెట్టి.
ఫస్ట్ సీన్‌తోనే రామాయణాన్ని సోషలైజ్ చేస్తూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు రివీల్ చేశారు. ఆ తర్వాత సీతగా కరీనా కిడ్నాప్, తనను వెతికే రాముడిగా అజయ్ దేవగణ్ కనిపించగా.. లక్ష్మణుడి తరహా పాత్రలో టైగర్ ష్రాఫ్, హనుమంతుడిని పోలిన పాత్రలో రణ్‌వీర్ సింగ్, గరుత్మంతుడిని పోలిన పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించారు.
ALSO READ | Tripti Dimri: బ్యూటీ త్రిప్తి డిమ్రి అందాల రాజసం
లేడీ సింగం శక్తి శెట్టిగా దీపిక పదుకొణె, పవర్‌ఫుల్ తమిళ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. రావణుడి లాంటి అర్జున్ కపూర్ పాత్రను చంపి సీతను తీసుకొచ్చేందుకు వీళ్లంతా ఎలా హెల్ప్ చేశారు అనేది ట్రైలర్‌లోనే కొంత టచ్ చేశారు. మొత్తానికి ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు రామాయణం, హిందూత్వం, మహారాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అంశాలను తన కాప్ యూనివర్స్‌లో మిళితం చేశాడు రోహిత్ శెట్టి. దీపావళి సంద్భంగా నవంబర్ 1న సినిమా విడుదల కానుంది.
సింగమ్ ఎగైన్ రికార్డ్:
సాధారణంగా సినిమా ట్రైలర్లు ఎక్కువలో ఎక్కువంటే 2 నుంచి 3 నిమిషాలు ఉంటాయి. ఇంకా కొన్ని చిత్రాలకి 3 నిమిషాల మార్క్ కూడా దాటుతుంది కూడా. అయితే, సింగం ఎగైన్ ట్రైలర్ నిడివి చూసుకుంటే మాత్రం.. లిమిట్ పెంచేసింది. ఈ మూవీ ట్రైలర్ ఏకంగా 4 నిమిషాల 58 సెకన్లుగా ఉంది. హిందీలో అత్యంత ఎక్కువ నిడివితో వచ్చిన ట్రైలర్‌గా సింగం ఎగైన్ రికార్డు క్రియేట్ చేసింది.అంతేకాకుండా ఇతిహాసం రామాయణాన్ని రిఫరెన్స్‌గా తీసుకోవడం ఆడియన్స్ కు ఆసక్తికరంగా కనిపిస్తోంది.
సింగం ఎగైన్ ఓటీటీ:
ఇకపోతే ‘సింగం ఎగైన్’ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయని గాసిప్స్ గుప్పుమన్నాయి. అమెజాన్ ప్రైమ్ ఏకంగా 130 కోట్ల రూపాయలకు ‘సింగం అగైన్’ సినిమా ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసిందని బీ టౌన్ కోడై కూస్తోంది.