చిరంజీవి ఇంట్లో అసలు ఎంతమంది ఆడపిల్లలున్నారు..? ఫుల్ డీటైల్స్ ఇవే..

చిరంజీవి ఇంట్లో అసలు ఎంతమంది ఆడపిల్లలున్నారు..? ఫుల్ డీటైల్స్ ఇవే..

కొణిదెల వంశ వృక్షం గురించి నెటిజన్లు ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. వారసత్వంపై సినీ నటుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ‘ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మనుమరాళ్లతో ఉన్నట్టుగా ఉండదు.. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్‌‌‌‌‌‌‌‌లా ఉంటుంది. చుట్టూ ఆడపిల్లలే’ అని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అసలు ఆయన ఎందుకు అలా అన్నారో, ఆయన ఇద్దరు కుమార్తెలకు అసలు ఎంతమంది ఆడ పిల్లలున్నారోనని నెటిజన్లు వెతుకులాట సాగిస్తున్నారు. చిరంజీవి, సురేఖ దంపతుల సంతానం, ఆ సంతానానికి కలిగిన పిల్లల వివరాలపై ఓ లుక్కేద్దాం.

చిరంజీవి, సురేఖ దంపతులకు మొత్తం ముగ్గురు సంతానం. రాంచరణ్, సుస్మిత, శ్రీజ. సుస్మితకు విష్ణు ప్రసాద్తో వివాహమైంది. సుస్మిత, విష్ణు ప్రసాద్కు ఇద్దరు ఆడ బిడ్డలు. ఒక పాప పేరు సమర. మరో పాప పేరు సంహిత. శ్రీజకు శిరీష్ భరద్వాజ్తో వివాహమైంది. వీరికి పాప పుట్టింది. ఈ పాప పేరు నివృతి. శ్రీజ, శిరీష్ భరద్వాజ్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కల్యాణ్ దేవ్తో శ్రీజకు పెళ్లైంది. శ్రీజ, కల్యాణ్ దేవ్కు పాప పుట్టింది. ఈ పాప పేరు నవిష్క. శ్రీజ, కల్యాణ్ దేవ్ మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఇద్దరూ విడిపోయారు. చిరంజీవి ఇద్దరు కుమార్తెలకు నలుగురు ఆడ పిల్లలున్నారు. చిరంజీవి కొడుకు రాంచరణ్. రాంచరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టింది. ఆ పాప పేరు క్లీంకారా. ఇలా మొత్తంగా.. చిరంజీవికి మొత్తం ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు.

చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్కు ముగ్గురు సంతానం. పవన్ కల్యాణ్ కొడుకు పేరు అకీరా నందన్. కుమార్తెల పేర్లు ఆద్య, పొలెనా అంజనా. చిరంజీవి మరో తమ్ముడు నాగబాబుకు కూడా ఇద్దరు సంతానం. ఆ ఇద్దరిలో ఒకరు వరుణ్ తేజ్ కాగా, మరొకరు నిహారిక. మొత్తంగా చూసుకుంటే.. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మగపిల్లలతో పోల్చితే ఆడబిడ్డలే ఎక్కువ. అయినప్పటికీ వారసత్వంపై మక్కువతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆయన ఇమేజ్ను పలుచన చేశాయి. ‘ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మనుమరాళ్లతో ఉన్నట్టుగా ఉండదు.. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్‌‌‌‌‌‌‌‌లా ఉంటుంది. చుట్టూ ఆడపిల్లలే.. ఒక్క మగాడు లేకుండా’ అని చిరు కామెంట్ చేశారు.  ఆ సంభాషణను కొనసాగిస్తూ.. ‘‘చరణ్ ఈ సారికైనా సరే ఒక అబ్బాయిని కనరా.. మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక.  ఈ అమ్మాయి (క్లీంకార) అంటే ముద్దు..   మళ్లీ ఇంకో అమ్మాయిని కంటారేమోనని భయం” అని చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై జాతీయ మీడియాలో కూడా కథనాలు ప్రసారం కావడంతో చిరు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ALSO READ | అందరూ రిలేట్ చేసుకునే ప్రేమకథ కృష్ణ అండ్ హిస్ లీల

కొడుకులు మాత్రమే వారసులా? కూతుర్లు కాదా? అంటూ ఆయనను పలువురు ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్​ ప్రధాన పాత్రల్లో నటించిన  ‘బ్రహ్మా ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ఈవెంట్​కు బుధవారం చిరంజీవి హాజరయ్యారు. ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో రామ్ చరణ్‌‌‌‌‌‌‌‌ కూతురు క్లీంకార సహా ఇతర మనవరాళ్లతో చిరంజీవి ఉన్న ఫొటోను ప్రదర్శించారు. ఈ సందర్భంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. మగ పిల్లలతోనే తన లెగసీ కొనసాగుతుందని చిరంజీవి లాంటి అత్యున్నత స్థాయి వ్యక్తి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆడపిల్లలు వారసులా? కాదా? అంటూ దేశవ్యాప్తంగా పలువురు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతూ, అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో కూడా కొడుకే వారసుడు అవ్వాలనే చిరంజీవి ఆలోచన సరికాదని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.