గూడెం గుడిలో దొంగల బీభత్సం

దండేపల్లి, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరో అన్నవరంగా పేరుగాంచిన గూడెం సత్యనారాయణ స్వామి గుడిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం తెల్లవారుజామున ముసుగు ధరించిన ఇద్దరు దొంగలు ఆలయ ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. 

స్వామి గర్భగుడి ద్వారం తాళం కూగా పగులగొట్టి అమ్మ వారి మెడలోని ఎనిమిది గ్రాముల బంగారు పుస్తెల తాడు, హుండీ పగులగొట్టి సుమారు రూ.5నుంచి 7 వేళా వరకు నగదు ఎత్తుకెళ్లిపోయారు. మొత్తం చోరీ చేసిన విలువ రూ.30 వేల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ కంప్లైంట్​మేరకు లక్షెట్టిపేట సీఐ క్రిష్ణ క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించి విచారణ జరుపుతున్నారు. ఈ గుడిలోనే 2002లో ఇదే తరహాలో దోపిడీ జరిగింది.