హనుమత్​ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..

హనుమత్​ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..

హిందూ పండుగల్లో  ముఖ్యమైన పండగ హనుమాన్ జయంతి. అయితే ఈ పండుగను కొంతమంది చైత్ర మాసంలో, మరికొంత మంది వైశాఖ మాసంలో జరుపుకుంటారు. ఆంజనేయుని తల్లి దండ్రులు ఎవరు.. ఆయన జన్మ రహస్యం ఏమిటి... పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. . . 

హిందూ పండుగల్లో  ముఖ్యమైన పండగ హనుమాన్ జయంతి. అయితే ఈ పండుగను కొంతమంది చైత్ర మాసంలో, మరికొంత మంది వైశాఖ మాసంలో జరుపుకుంటారు. క్రోధి నామ సంవత్సరంలో (2024)  ఏప్రిల్ 23న మంగళవారం   హనుమాన్ జయంతి తిథి  వచ్చింది. ఏప్రిల్ 23   ఉదయం 03:25 గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమై ... 24 ఏప్రిల్  ఉదయం 05:18 గంటలకు ముగుస్తుంది.ఈ విధంగా ఉదయ తిథి ప్రకారం.. హనుమాన్ జయంతిని ఏప్రిల్ 23 మంగళవారం జరుపుకుంటారు. 

ప్రాముఖ్యత విషయానికి వస్తే  వాల్మీకి రచించిన ఉత్తర కందా ప్రకారం వానర రాజు కేసరి, అంజనా దంపతులకు హనుమంతుడు జన్మించాడని పురాణాల్లో రుషి పుంగవులు పేర్కొన్నారు. వానర రాజు కేసరి... విశ్వామిత్రుడిని బాధపెట్టినందుకు ఆమెను శాపించాడట. ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి  శివుడిని ఆరాధించాడని.. అందుకే శివుడు హనుమంతుడి అవతారంలో  కేసరి భార్య అయిన అంజనాదేవికి  జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడిని వాయుదేవుని కుమారుడు లేదా గాలి దేవుడు అని కూడా అంటారు. తెలుగు రాష్ట్రాల్లో చైత్ర పూర్ణిమ రోజు 41 రోజుల పాటు దీక్షను ప్రారంభిస్తారు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలోని దశమి తిథి నాడు ఈ దీక్ష విరమిస్తారు.

also read : హనుమత్​ జయంతి 2024స్పెషల్: ​హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష


హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారు. "కలౌ కపి వినాయకౌ"అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవుడు అని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. 


యత్ర యత్ర రఘునాథ కీర్తనం- ...తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్..
 బాష్పవారి పరిపూర్ణలోచనం... - మారుతిం నమత రాక్షసాంతకమ్

  •  శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. హనుమాన్ జయంతి రోజు ( ఏప్రిల్​ 23) సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపం వెలిలిగించిన వారికి  ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
  •  “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది.
  • ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు. పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి