నంది వాహనంపై ఊరేగిన దుర్గామల్లేశ్వర స్వామి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి టెంపుల్​లో శివరాత్రి ఉత్సవాలు నాలుగో రోజైన ఆదివారం ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను నందివాహనంపై పట్టణంలో ఊరేగించారు. చిన్నారులు, మహిళల కోలాటాల మధ్య ఊరేగింపు కొనసాగింది. ఈ ప్రోగ్రాంలో టెంపుల్​ ఈఓ కె. సులోచన పాల్గొన్నారు.