పోలీస్ వ్యాన్‌లోకి వినాయక విగ్రహం ఎలా? ఇంటర్‌నెట్‌లో ఫొటో వైరల్

పోలీస్ వ్యాన్‌లోకి వినాయక విగ్రహం ఎలా? ఇంటర్‌నెట్‌లో ఫొటో వైరల్

పోలీస్ వ్యాన్‌లో గణనాథుని విగ్రహం ఉన్న ఫొటో ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేవుణి విగ్రహం పోలీస్ వాహనంలోకి ఎలా వెళ్లిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. గణేష్ విగ్రహం అరెస్ట్ అయినట్లుగా ఈ ఫొటో ఉంది. అంతే కాదు ఈ ఘటనపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

బీజేపీ లీడర్లు ఈ పని కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనే జరిగిందని ఆరోపిస్తు్న్నారు. ఈ ఫొటోపై విమర్శలు కూడా వస్తున్నాయి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఈ ఫొటోను Xలో షేర్ చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  పోలీస్ వ్యాన్‌లో వినాయక విగ్రహం ఉన్న ఈ దృశ్యం భయానకంగా ఉంది.. మన దేవతలను అవమానించడం.. నమ్మకాలను కించపరచడానికి కాంగ్రెస్  ఎందుకు నరకయాతన పడుతుందని ఆయన ప్రశ్నించారు. ఇంతకీ ఆ ఫొటో స్టోరీ ఏంటో ఓ లుక్ వేద్దాం పదండి.మండ్యా జిల్లా నాగమంగళ తాలూకాలోని గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా జరిగిన హింసకు నిరసనగా బెంగుళూర్‌లో సుమారు 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూర్ మెట్రోపాలిటన్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక విగ్రహంతో టౌన్ హాల్ ప్రాంతంలో నిర్వహించే నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 

ALSO READ | గణేష్ నిమజ్జనం స్పెషల్ : మోడ్రన్ బ్యాండ్ బాయ్స్.. తీన్మార్ స్టెప్పులు

దుకాణాలు, వాహనాలపై రాళ్లతో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్ చేసిన హిందువులను విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు డీసీపీ శేఖర్ నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని వ్యాన్‌లోకి ఎక్కించారు. వారి కోసం ఏర్పాటు చేసిన పోలీస్ వ్యాన్ లో గణేష్ విగ్రహాన్ని ఎక్కించారు. వారిని ఆందోళన జరుగుతున్న ప్రాంతం నుంచి వ్యాన్ లో తరలిచారు.