తొలి ఏకాదశికి పూజించాల్సిన దేవుడు ఎవరు.. ఆ పూజ ఎలా చేయాలి..?

తొలి ఏకాదశికి పూజించాల్సిన దేవుడు ఎవరు.. ఆ పూజ ఎలా చేయాలి..?

మన హిందూ ధర్మంలో ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు విశిష్టతలు దాగి ఉన్నాయి.అదే విధంగా ప్రతి నెల ఎన్నో రకాల పండుగను ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.  ఈ క్రమంలోనే సంవత్సరంలో మనకు 12 ఏకాదశులు వస్తాయి.ఈ ఏకాదశిని హిందువులు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ ఏకాదశిలలో ఆషాడమాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది.ఈ ఏకాదశిని హిందువులు తొలి ఏకాదశి, శయన ఏకాదశి,హరివాసరం అని కూడా పిలుస్తారు. మరి ఎంతో విశిష్టత కలిగిన ఈ తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి? ఈ రోజు పూజా ఎలా చేయాలి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగా భావిస్తారు.20241 జూలై 17 వ తేదీన తొలి ఏకాదశిని జరుపుకుంటున్నారు.ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి శయన పాన్పుపై భక్తులకు దర్శనమిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ALSO READ | హిందువుల తొలి పండుగ ఏదో తెలుసా..

పురాణాల ప్రకారం ఈ ఏకాదశి నుంచి సూర్యుడు దక్షిణాయనం దిశలో మనకు కనిపిస్తారు.తొలి ఏకాదశి ని రైతులు విత్తనాల ఏకాదశిగా కూడా జరుపుకుంటారు.తొలి ఏకాదశి రోజు భక్తులు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.తొలి ఏకాదశి పండుగ రోజు జరుపుకునే వారు ఉదయమే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకునే విష్ణు దేవుడి ఫోటో లేదా విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేస్తారు. ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు.కర్పూర హారతి ఇవ్వాలి. భక్తులు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. దుష్ట పనులు, ఆలోచనలు చేయకూడదు. రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు శ్రీహరిని పూజించి భోజనం చేయాలి

ALSO READ | తొలిఏకాదశి రోజు పేలాల పిండి ఎందుకు తినాలో తెలుసా..

ఓం నమో భగవతే వాసుదేవాయ " ఈ ద్వాదశ మంత్రాన్ని జపించాలి. రామ, కృష్ణ, నారాయణ మొదలైన పేర్లతో భగవన్నామ స్మరణ చేయాలి. విష్ణు శహస్రనామాలను జపించండి. విష్ణు భగవానుడిని స్మరించి ప్రార్థించండిలా... హే త్రిలోక నాథా! నా గౌరవం నీ చేతిలో ఉంది. కాబట్టి నేను చేసిన ఈ ప్రతిజ్ఞను పూర్తి చేయడానికి శక్తిని ఇవ్వమని భగవంతుడిని వేడుకోండి. ఈ పూజ చేసేవారు ధాన్యాలు, పప్పులు, శనగలు, మొక్క జొన్న, గోకరకాయ, చిక్కుడుకాయ, బఠాణిలను ఆహారపదార్ధాలుగా తీసుకోకూడదు.కేవలం పాలు పండ్లు వంటి పదార్థాలను తీసుకునీ ఉపవాస దీక్షతో పూజ చేయాలి.

ALSO READ | తొలి ఏకాదశి విశిష్టత.. ఈ వ్రతం చేస్తే శివకేశవులతోపాటు అమ్మ అనుగ్రహం

ఒకవేళ ఏకాదశి పండుగను జరుపుకొనివారు ఈరోజు మాంసం గుడ్లు చేపలు వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు.ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు కనుక ఈరోజు ఎట్టి పరిస్థితులలో తులసీ దళాలను కోయకూడదు. అలాగే స్వామి వారి పూజ అనంతరం స్వామివారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత విష్ణు సహస్రనామాలను చదవాలి.అదే విధంగా ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయమే స్వామివారికి పూజ చేసిన అనంతరం ఉపవాస దీక్ష విరమించాలి.   ఈ విధంగా తొలిఏకాదశి పండుగను హిందువులు ఎంతో భక్తి భావంతో జరుపుకుంటారు.