దర్గాలో సీతారాముల విగ్రహాల ప్రతిష్ఠాపన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం సత్యనారాయణపురం సమీప అడవిలో ఉన్న నాగుల్ మీరా దర్గాలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించారు. గత కొన్ని ఏళ్లుగా ముస్లింల ఆరాధ్య దైవంగా నాగులు మీరా వీరసిల్లుతున్నాడు. కులమతాలకతీతంగా నాగులు మీరా దర్గాలో పూజలు ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. గత రెండు సంవత్సరాలుగా ఈ దర్గాలో శ్రీరామనవ ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఇల్లెందుకు చెందిన ఓ వ్యక్తి రూ.30 లక్షల వ్యయంతో  వెండి విగ్రహాలను ఏర్పాటు చేశాడు. దర్గా నిర్వాహకులు ఆ విగ్రహాలకు ఘనంగా పూజలు నిర్వహించి ప్రతిష్టించారు. ఈ ప్రతిష్ట సందర్భంగా క్షీరాదివాసం, జలాదివాసం, పంచగవ్యాదివాసం, పుష్పాదివాసం, డింభకర్ణ హరణ దోష దివాసం, వాస్తు, నవగ్రహ, అష్టదిక్పాలక, క్షేత్రపాల, కమ్మ మండక తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించి వెండి సింహాసనంపై విగ్రహాలను ప్రతిష్టించి సీతారాములకు శాంతి కళ్యాణం నిర్వహించారు. అత్యంత వైభవో పెతంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హిందూ ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిపారవశంలో మునిగితేలారు.