
రాముడు, సీత, లక్ష్మణుడు. ఆంజనేయుడు, రావణుడు.. ఇలా రామాయణంలోని ప్రతీ పాత్రల నేపథ్యం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ, రాముడికి ఓ అక్క ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. ఆమె పేరు శాంత.
దశరథుడు-కౌసల్యకు పుత్రకామేష్టి యాగం కంటే ముందే జన్మించిన సంతానం ఆమె. అంగవైకల్యంతో పుట్టిన ఆ పాపకి 'శాంత' అని పేరు పెట్టి, మహర్షుల సలహా మేరకు అంగదేశ రాజైన రోమపాదుడికి దత్తత ఇచ్చాడు దశరథుడు. అక్కడ సరైన వైద్యంతో శాంత మామూలు స్థితికి వస్తుంది. శాంత చాలా అందగత్తె. వేదాలు, హస్తకళల్ని నేర్చింది. యుద్ధ విద్యల్లో -ఆరితేరింది.
ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో అంగదేశంలో భయంకరమైన కరువు సంభవించింది. అప్పుడు ఆమె రుష్యశృంగ మహర్షిని వివాహం చేసుకుంది. ఆయన నిర్వహించిన యజ్ఞంతోనే అంగదేశం కరువు కోరల్లోంచి బయటపడింది. వశిష్ఠ రామాయణం ఆదిపర్వంలో శాంతా దేవి గురించి ప్రస్తావించిరు వాల్మీకి మహర్షి. హిమాచల్ ప్రదేశ్ కులు దగ్గర బంజారా ప్రాంతంలో రిష్యశృంగుడి ఆలయం ఉంది. ఇందులో శాంతాదేవి విగ్రహం పూజలందుకుంటోంది