శ్రైశైలం పుణ్యక్షేత్రంలో మహా అద్భుతం జరిగింది. పాతాళగంగ రోడ్డు మార్గంలోని.. వజ్రమ్మ గంగమ్మ సమీపంలో ఆలయం ఉంది. అక్కడ నిత్యం శివుడికి అభిషేకాలు కూడా చేస్తుంటారు.. 2024, జూలై 16వ తేదీ ఉదయం.. ఆ శివ లింగానికి అభిషేకం చేయాలని భక్తులు తరలివచ్చారు. అక్కడ వాళ్లకు ఓ మహా అద్భుతం కనిపించింది. శివ లింగాన్ని చుట్టుకుని ఉన్న నాగ పాము కనిపించింది. ఆ నాగ పాము అటూ ఇటూ కాదులుతూ నాట్యం చేయటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇదంతా శివుడి మహిమ అంటూ అక్కడి భక్తులు.. పెద్ద ఎత్తున హర హర మహాదేవ.. శంభో శంకరా అంటూ పెద్ద ఎత్తున పరమ శివుడిని ఆరాధించారు. శివ నామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
సుమారు అర గంట సమయం కంటే ఎక్కువగానే.. శివ లింగం చుట్టూ ఆ నాగు పాము ఉండటం.. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని స్థానికులు చెప్పారు. శివుడి మెడలో ఉండే ఆ నాగ దేవతే ఇవాళ స్వయంగా భక్తులకు ప్రత్యక్ష్యం అయ్యిందంటూ భక్తులు చెప్పుకోవటం విశేషం..