ఆధ్యాత్మికం : ప్రతి సోమవారం.. ఈ మంత్రంతో శివుడిని పూజిస్తే.. మీరు అనుకున్న కోరికలు తీరతాయి..

ఆధ్యాత్మికం : ప్రతి సోమవారం.. ఈ మంత్రంతో శివుడిని పూజిస్తే.. మీరు అనుకున్న కోరికలు తీరతాయి..

పరమేశ్వరుడు.. భోళా శంకరుడు.. నీలకంఠేశ్వరుడు..  శివ పరమాత్ముడు.. శివయ్య.. శివుని అనుగ్రహం పొందడానికి సోమవారం ప్రత్యేక పూజలు చేస్తారు,  ఆ రోజు ఆ మహాదేవుడినిపూజిస్తే భక్తుల కోర్కెలు తీరతాయని పండితులు చెబుతున్నారు.  కోరిన కోర్కెలు తీరాలంటే సోమవారం మహాదేవుడిని.. శివ పరమాత్ముడిని ఎలాపూజించాలో తెలుసుకుందాం.. . .

సోమవారం విశిష్టత సనాతన ధర్మంలో వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవుడు లేదా దేవతకి అంకితం చేయబడింది. సోమవారం శివుడి ఆరాధనకు ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. భగవంతుడు శివుడు తనను నమ్మిన భక్తుల కోరికలను నెరవేర్చడంలో కరుణామయుడిగా నిలుస్తాడని పురాణాల్లో పేర్కొన్నారు. 

మహాదేవుడి పూజా విధానం సోమవారం శివుడిని పూజించే భక్తులు, తల్లి పార్వతిని కూడా ఆరాధిస్తారు. పూజ సమయంలో పంచామృతంతో అభిషేకం చేసి, బిల్వపత్రాలతో శివలింగం అలంకరించటం ఎంతో శుభప్రదం. ఉపవాసం పాటించడం ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చని, ముఖ్యంగా పెళ్లి సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ వ్రతాన్ని పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు.అంతేకాకుండా శివయ్యకు ఉన్న 108 నామాలను పఠిస్తూ బిల్వపత్రాలతో పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.

శివుని 108 పేర్లు

  • ఓం మహాకాల నమః
  • ఓం భీమేశ్వరాయ నమః
  • ఓం విష్ధారి నమః
  • ఓం బం భోలే నమః
  • ఓం విశ్వనాథ నమః
  • ఓం అనాదిదేవ నమః
  • ఓం ఉమాపతియై నమః
  • ఓం గోరపతియై నమః
  • ఓం గణపితాయ నమః
  • ఓం ఓంకార్ స్వామి నమః
  • ఓం ఓంకారేశ్వరాయ నమః
  • ఓం శంకర త్రిశుల్ధారి నమః
  • ఓం భోలే బాబా నమః
  • ఓం శివాజీ నమః
  • ఓం రుద్రనాథాయ నమః
  • ఓం భీమశంకర్ నమః
  • ఓం నటరాజ నమః
  • ఓం ప్రలేయంకరాయ నమః
  • ఓం చంద్రమోళి నమః
  • ఓం దమరుధారీ నమః
  • ఓం చంద్రధారి నమః
  • ఓం దక్షేశ్వరాయ నమః
  • ఓం ఘ్రేణేశ్వర నమః
  • ఓం మణిమహేష్ నమః
  • ఓం అనాది నమః
  • ఓం అమర్ నమః
  • ఓం అశుతోష మహారాజ్ నమః
  • ఓం విల్వకేశ్వరాయ నమః
  • ఓం భోలేనాథ్ నమః
  • ఓం కైలాస పతి నమః
  • ఓం భూతనాథ నమః
  • ఓం నందరాజ నమః
  • ఓం నంది రితే నమః
  • ఓం జ్యోతిర్లింగ నమః
  • ఓం మాలికార్జున నమః
  • ఓం శంభు నమః
  • ఓం నీలకంఠ నమః
  • ఓం మహాకాళేశ్వరాయ నమః
  • ఓం త్రిపురారి నమః
  • ఓం త్రిలోకనాథ నమః
  • ఓం త్రినేత్రధారి నమః
  • ఓం బర్ఫానీ బాబా నమః
  • ఓం లంకేశ్వరాయ నమః
  • ఓం అమర్నాథ్ నమః
  • ఓం కేదార్‌నాథ్ నమః
  • ఓం మంగళేశ్వరాయ నమః
  • ఓం అర్ధనారీశ్వర నమః
  • ఓం నాగార్జున నమః
  • ఓం జటాధారి నమః
  • ఓం నీలేశ్వరాయ నమః
  • ఓం జగత్పితాయ నమః
  • ఓం మృత్యుంజనే నమః
  • ఓం నాగధారి నమః
  • ఓం రామేశ్వరాయ నమః
  • ఓం గలసర్పమలాయ నమః
  • ఓం దిననాథ నమః
  • ఓం సోమనాథ నమః
  • ఓం యోగీ నమః
  • ఓం భండారీ బాబా నమః
  • ఓం బమ్లేహరి నమః
  • ఓం గోరిశంకరాయ నమః
  • ఓం శివకాంత నమః
  • ఓం మహేశ్వరే నమః
  • ఓం మహేశ నమః
  • ఓం సంకథారీ నమః
  • ఓం మహేశ్వరాయ నమః
  • ఓం రుండమాలధారి నమః
  • ఓం జగపాలంకర్తాయ నమః
  • ఓం పశుపతియై నమః
  • ఓం సంగమేశ్వరాయ నమః
  • ఓం అచలేశ్వరాయ నమః
  • ఓం ఓలోకనాథ నమః
  • ఓం ఆదినాథ నమః:
  • ఓం దేవదేవేశ్వరాయ నమః
  • ఓం ప్రన్నత్ నమః
  • ఓం శివం నమః
  • ఓం మహాదాని నమః
  • ఓం శివదాని నమః
  • ఓం అభయంకరాయ నమః
  • ఓం పాతాలేశ్వరాయ నమః
  • ఓం ధూధేశ్వరాయ నమః
  • ఓం సర్పధారి నమః
  • ఓం త్రిలోకిన్రేష నమః
  • ఓం హఠ యోగీ నమః
  • ఓం విశ్లేశ్వరాయ నమః
  • ఓం నాగధిరాజ నమః
  • ఓం సర్వేశ్వరాయ నమః
  • ఓం ఉమాకాంత నమః
  • ఓం బాబా చంద్రేశ్వర నమః
  • ఓం త్రికాలదర్శియై నమః
  • ఓం త్రిలోకి స్వామి నమః
  • ఓం మహాదేవ్ నమః
  • ఓం గర్భశంకర్ నమః
  • ఓం ముక్తేశ్వరాయ నమః
  • ఓం నటేశ్వరాయ నమః
  • ఓం గిరిజపతియై నమః
  • ఓం భద్రేశ్వరాయ నమః
  • ఓం త్రిపుణశక నమః
  • ఓం నిర్జేశ్వరాయ నమః
  • ఓం కిరాతేశ్వరాయ నమః
  • ఓం జగేశ్వరాయ నమః
  • ఓం అబ్ధూత్పతి నమః
  • ఓం భిల్పతి నమః
  • ఓం జిత్నాథ నమః
  • ఓం వృషేశ్వరాయ నమః
  • ఓం భూతేశ్వరాయ నమః
  • ఓం బైజునాథ నమః
  • ఓం నాగేశ్వరాయ నమః

సమస్యల పరిష్కారానికి సోమవారం పూజ ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యల వంటి ఇబ్బందులను అధిగమించడానికి సోమవారం పూజ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పూజా సమయంలో శివ స్తోత్రాలు చదవటం లేదా “ఓం నమః శివాయ” మంత్రాన్ని జపించడం శుభం చేస్తుంది. అలాగే శివుడికి శుద్ధ జలంతో అభిషేకం చేయడం ద్వారా అన్ని తలకిందుల పరిస్థితులు సమసిపోతాయని పురాణ గాథలు చెబుతున్నాయి.  

►ALSO READ | Good Health: పొద్దున్నే పరగడుపున ఇవి తినండి... షుగర్​ కంట్రోల్​ తో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది..!