ఏకంగా గుడిని ఆక్రమించి ఇళ్లు కట్టేశారు.. 45 ఏళ్ల తర్వాత శివాలయం రీఓపెన్

ఏకంగా గుడిని ఆక్రమించి ఇళ్లు కట్టేశారు.. 45 ఏళ్ల తర్వాత శివాలయం రీఓపెన్

ఉత్తరప్రదేశ్: సంభాల్‌లోని ఖగ్గు సరాయ్ ప్రాంతంలో 1978 నుండి కనిపించకుండా పోయిన ఓ శివాలయం 45 ఏళ్ల తర్వాత తిరిగి తెరవబడింది. ఆలయం ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించి కొందరు ఇళ్లు నిర్మించుకోవడమే అందుకు ప్రధాన కారణం. 

కొందరు ఆలయాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నట్లు సర్వేలో తేలిందని.. ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామని సంభాల్‌ అడిషనల్ ఎస్పీ శ్రీశ్‌చంద్ర మీడియాకు వెల్లడించారు. ఆలయ పరిసరాలను శుభ్రం చేసినట్లు ఆయన తెలిపారు. గుడిలో శివుడు, హనుమంతుడు విగ్రహాలు ఉన్నట్లు వివరించారు. ఆలయాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో ఈ ప్రాంతంలో హిందూ కుటుంబాలు నివసించేవారని, కొన్ని కారణాల వల్ల వారు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారని పేర్కొన్నారు.