
వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం అలివేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం కనుల పండువగా సాగింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకలకు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు.
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేయగా, సత్యసాయిబాబా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బీవీ రామారావు బటర్ మిల్క్ పంపిణీ చేశారు. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాగా, భక్తుల సౌకర్యార్థం తాగునీరు, టాయిలెట్స్ ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడ్డారు.