వామన అవతారం తరువాత విష్ణుమూర్తి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో తెలుసా...

వామన అవతారం తరువాత విష్ణుమూర్తి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో తెలుసా...

భారతదేశం దేవాలయాల నిలయం. ఇక్కడ లక్షల దేవాలయాలు ఉన్నాయి. వీటిలోని పలు ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయాలలోని కొన్నింటిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని అందమైన ఆలయాలైతే, మరికొన్ని అద్భుతాలకు నిలయాలు. వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత విష్ణువు మొదటిసారి ఇక్కడే ప్రత్యక్షమయ్యాడని స్థానికులు నమ్ముతారు..

కొన్ని దేవాలయాలు దూరప్రాంతాలలో నెలకొనివుంటాయి. వాటి దగ్గరకు చేరుకోవాలంటే ఎంతో శ్రమించాలి. అలాంటి ఒక దేవాలయం ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఉంది. ఈ బస్తీ నారాయణ్ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయం ఏడాది పొడవునా మూసివేసే ఉంటుంది. కేవలం రక్షా బంధన్(రాఖీ) రోజున మాత్రమే ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత విష్ణువు మొదటిసారి ఇక్కడే ప్రత్యక్షమయ్యాడని స్థానికులు నమ్ముతారు..

ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలోని దుర్గమ లోయలో ఉన్న ఈ ఆలయాన్ని బస్తీనారాయణ లేదా వంశీనారాయణ దేవాలయం అని అంటారు. ఈ ఆలయానికి చేరుకోవడం అంత సులభమేమీ కాదు. దాదాపు 12 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తూ చాలా మంది ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ దేవాలయం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. బన్సీ నారాయణ్ ఆలయంలో విష్ణువు, శివునితో పాటు గణేశుని విగ్రహాలు కూడా కనిపిస్తాయి.

ఈ ఆలయ తలుపులు రక్షా బంధన్ రోజున మాత్రమే తెరుస్తారు. రక్షా బంధన్ నాడు స్దానికులు ఈ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టే సమయానికి ముందు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం విషయానికొస్తే విష్ణువు తన వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత ఇక్కడే మొదటిసారిగా కనిపించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో ఒక గుహ కూడా ఉంది. ఇక్కడ భక్తులు కానుకలు సమర్పించుకుంటారు. రక్షాబంధన్ రోజున స్థానికులు ప్రసాదంలో వెన్న కలిపి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు.