పూజ చేసే సమయంలో పుష్పాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అలంకారం నుండి దేవతల పూజ వరకు అన్ని పనులలో పువ్వులు ఉపయోగిస్తారు. పువ్వులు దేవుడికి చాలా ప్రీతికరమైనవి. పురాణాల్లో దేవతలకు ఇష్టమైన పువ్వుల గురించి కూడా పేర్కొన్నారు. అందులో అపరాజిత పుష్పం ఒకటి. దీనినే కొందరు విష్ణుకాంత, మరికొందరు శంఖ పుష్పం అని కూడా అంటారు. ఈ శంఖ పుష్పానికి దేవుళ్ళకు ప్రీతిపాత్రమైనది నమ్మకం. ముఖ్యంగా శంఖు పుష్పం శని దేవుడితో ఉందని నమ్మకం. ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది. శనీశ్వరుడికే కాదు.. ఈ పుష్పం విష్ణువుకు కూడా చాలా ప్రీతికరమైనది. అంతేకాదు ఈ పుష్పానికి జ్యోతిషశాస్త్రంలో కొన్ని నివారణలకు ఉపయోగపడతాయని నమ్మకం. విష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడు అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుందని నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను ఈ శంఖి పుష్పం తీరుస్తుంది. ఆ కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది.
కొంత మంది డబ్బు సంపాదిస్తారు, కానీ డబ్బు అంతా నీళ్లలా ఖర్చు అయిపోతుంది. ఇలాంటి వారు సోమవారం నాడు.. ఐదు శంఖ పుష్పాలను తీసుకుని, వాటిని నదిలో కలపండి. ఇలా చేయడం వలన ఆర్ధిక ఇబ్బందుల సమస్య తీరుతుంది. డబ్బు కొరత ఉండదు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉంటే.. మంగళవారం నాడు, హనుమంతుని పాదాల వద్ద అపరాజిత పుష్పాన్ని సమర్పించండి. పూజ చేసిన తరువాత.. ఈ పువ్వును తీసుకొని గల్లా పెట్టెలో లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు తీరతాయి.
వ్యాపారంలో నష్టాలు వస్తుంటే.. శంఖు పుష్పం మొక్క వేరును నీలిరంగు గుడ్డలో కట్టి, దుకాణం వెలుపల వేలాడదీయండి. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. డబ్బు సమస్యను అధిగమించడానికి.. సోమవారం శివలింగానికి శంఖు పుష్పం ఉన్న జలం ని సమర్పించండి. శనివారం రోజున శని దేవుడికి ఈ పుష్పాలను సమర్పించండి. ఇది మీ జాతకంలో శని స్థానాన్ని బలపరుస్తుంది. మీకు డబ్బుకు లోటు ఉండదు.ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉంటే లేదా మీకు చాలా కాలం నుండి ప్రమోషన్ రాకపోతే, అప్పుడు 6 శంఖం పువ్వులు, 5 పటిక ముక్కలను అమ్మవారికి సమర్పించండి. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు కూడా జేబులో పటిక ముక్కలను పెట్టుకుని వెళ్లండి.
ALSO READ : ఆ గుళ్లో కొబ్బరికాయ కట్టండి.. సమస్యలను దూరం చేసుకోండి
చాలా ఔషధ మొక్కలు, మనకి అందుబాటులో ఉంటాయి. ఔషధ మొక్కల వలన, అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు. శంఖ పుష్పం గురించి, కొత్తగా చెప్పక్కర్లేదు. మన చుట్టుపక్కల ఇది దొరుకుతూ ఉంటుంది. ఈ చెట్టు గుబురుగా ఉంటుంది. ఈ చెట్టు పొలాల కంచల వెంట, రహదారులకి డొంకలకు ఇరువైపులా బాగా మనకి కనబడుతుంటాయి. పుష్పాలు తో అనేక లాభాలు ఉంటాయి. చాలామందికి శంఖ పుష్పాల వలన కలిగే లాభాలు తెలియదు.
ఈ పూల ని ఆయుర్వేదంలో ఎప్పటినుండో వాడుతున్నారు. అనేక రోగాలకి చికిత్సగా ఉపయోగిస్తున్నారు. భూసారాన్ని పెంచడానికి, కొన్ని ప్రాంతాలలో దీనిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ శంఖ పుష్పాలను వివిధ దేవతలకు జరిపే పూజల్లో కూడా వాడుతూ ఉంటారు. శంఖ పుష్పాలతో పూజ చేయడం వలన, డబ్బుకి ఎలాంటి లోటు ఉండదట. శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన, ఈ తీగ మొక్క పుష్పాలు దేవతారాధనకి ఉపయోగపడతాయి. చాలామంది, మొక్కల్ని ఇళ్లల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు.