Breaking News: ఘోర ప్రమాదం: లారీ ‌‌– బైక్​ ఢీ.. భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం

Breaking News:  ఘోర ప్రమాదం: లారీ ‌‌– బైక్​ ఢీ.. భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం

గజ్వేల్​... సిద్దిపేట రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది.  ఈ రోజు ఉదయం ( మార్చి 23) 8 గంటలకు  హమ్​ దీపూర్​ శివారులోని పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్.. లారీ ఢీకొన్నాయి.  సిద్దిపేట నుంచి వస్తున్న లారీ.. బైక్​ వెళ్తున్న దంపతులపై దూసుకెళ్లింది.  ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. భర్తకు రెండు కాళ్లు శరీరం నుంచి విడిపోయాయి.  సమాచారం అందుకున్న గజ్వేల్​ ఎంపీటీసీ పంగ మల్లేశం 108 కు ఫోన్​ చేసి హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతుంది.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.