-
లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొట్టి ముగ్గురు మృతి
-
పలువురికి గాయాలు
హైదరాబాద్ : జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన పాలకుర్తి మండలం వావిలాలలో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు పాలకుర్తి నుంచి తొర్రూరు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వావిలాల గ్రామంలోని ఓ మూల మలుపు వద్ద ఎదురెదురుగా లారీ, ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి.
ఈ ప్రమాదంలో మహబూబ్ గర్ జిల్లా తొర్రూరు మండలం టీక్యా తండాకు చెందిన హేమాని (65), అతని భార్య బుజ్జమ్మ(60) పాలకుర్తి మండలానికి చెందిన హసీమా (58) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని డెడ్‌బాడీలను గవర్నమెంట్ దవాఖానకు తరలించారు. గాయపడ్డవారు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించారు.