జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం శివారులో 2024 మార్చి 17 ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టూ వీలర్ ఢీ కొట్టింది. దీంతో టూ వీలర్ పై ఉన్న ముగ్గురు చనిపోయారు. ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరొకరు హాస్పిటల్ కు తీసుకెళ్లేలోగా చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు.
మృతులంతా భవన నిర్మాణ పనుల పనికోసం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని.. మృతి చెందిన వారు వేణు, శ్రీకాంత్, వెంకటేశ్ గా పోలీసులు గుర్తించారు. వేణు అనే తాపీ మేస్త్రీ ఏపీ నుంచి వచ్చి మల్యాల మండలం ముత్యంపేటలో నివాసం ఉంటున్నాడని.. శ్రీకాంత్, వెంకటేష్ కొండగట్టుకు చెందిన వర్కర్లని తెలుస్తోంది. కొండగట్టు నుంచి ఇద్దరి వర్కర్లను తీసుకొని మెట్ పల్లిలో భవన స్లాబ్ పని కోసం.. ఒకే బండిపై వెళుతుండగా ప్రమాదం జరిగింది.