వెంకటాపురం, వెలుగు: ఆగి ఉన్న లారీని తుఫాన్ వెహికల్ ఢీకొట్టడంతో మేడారం జాతరకు వెళ్లొస్తున్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భూపాలపట్నం, మద్దేడు గ్రామాలకు చెందిన భక్తులు శుక్రవారం తుఫాన్ వెహికల్లో మేడారం జాతరకు వెళ్లారు.
వారిని దింపి డ్రెవర్ వెంకటేశ్, అతని బావమరిది తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో తమిళనాడుకు చెందిన సీఆర్పీఎఫ్కానిస్టేబుల్పెరుమాళ్చక్రపాణిని ఎక్కించుకున్నారు. అయితే ములుగు జిల్లా వాజేడు మండలం పాయబాట్ల వద్ద వీరి వెహికల్అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్చక్రపాణి, వెంకటేశ్బావమరిది అక్కడికక్కడే చనిపోయారు.
జాతరలో గుండెపోటుతో మహిళ..
మేడారం(భూపాలపల్లి అర్బన్), వెలుగు: మేడారం జాతరలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన బాద్రపు లక్ష్మి(68) అనే మహిళ గుండెపోటుతో చనిపోయింది. గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి జాతరకు వచ్చిన లక్ష్మి వనదేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్ స్టాండుకు వెళ్లిన లక్ష్మి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలింది. రెస్క్యూ టీం సాయంతో ఆమెను స్థానిక హెల్త్ సెంటర్ కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. మృతురాలికి భర్త లింగయ్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.