బోల్తాపడ్డ టమాటా లోడు లారీ.. రైతుకు18 లక్షల నష్టం

ఆదిలాబాద్, వెలుగు: టమాటా లోడ్​తో వెళ్తున్న ఓ లారీ ఆదిలాబాద్​జిల్లా మావల వద్ద శనివారం కారును తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. కర్నాటక నుంచి ఢిల్లీకి టమాటా లోడ్​తో వెళ్తోంది. లారీలో 638 పెట్టెల్లో రూ.18 లక్షల విలువైన టమాటాలు ఉండగా.. దాదాపు 50 శాతం దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, టమాటాలకు భారీగా ధరలు పెరగడంతో, రోడ్డుపై పెద్దఎత్తున పడిపోయాయని తెలుసుకున్న చుట్టుపక్కల జనాల వాటిని తీసుకునేందుకు తరలివచ్చారు. అయితే, అప్పటికే సమాచారం అందుకున్న  పోలీసులు అక్కడికి చేరుకొని ఎవరూ తీసుకోకుండా అడ్డుకున్నారు.