బియ్యం బస్తాలతో వెళ్తున్న లారీ బోల్తా.. డ్రైవర్కు గాయాలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సూరారంలో శనివారం తెల్లవారుజామున (సెప్టెంబర్ 02) రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ కు బియ్యం బస్తాలతో వెళ్తున్న లారీ కట్ట మైసమ్మ గుడి దగ్గరకు రాగానే అదుపు తప్పి కింద పడిపోయింది. దీంతో లారీలోని బియ్యం బస్తాలన్ని రోడ్డుపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని స్థానిక ఆసుత్రికి తరలించారు. 

ALSO READ :అక్కాచెల్లి మధ్య సెల్​ఫోన్​ లొల్లి.. చెల్లె సూసైడ్

నర్సాపూర్ ప్రధాన రహదారిపై బస్తాలు పడిపోవడంతో కిలో మీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. డ్రైవర్ నిద్ర మత్తులో లారీ నడపడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.