టూరిస్ట్ బస్సును ఢీకొట్టిన లారీ

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. స్టేషన్ ఘన్‎పూర్ మండలం చాగల్ గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేటకు చెందిన నవ యువత యువజన సంఘం సభ్యులు 27 మంది గోవా వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దాంతో బస్సులో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా.. మరో 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.