
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం సంగుపేట బ్రిడ్జ్ పై నుండి బండ రాళ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కిందికి పడింది. ఈ ప్రమాదంలో లారీలో డ్రైవర్ చిక్కుకోగా.. క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన స్థలంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.