
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో లారీ డ్రైవర్ ని తోటి స్నేహితులు హత్య చేశారు.సులేమాన్ నగర్ కు చెందిన లారీ డ్రైవర్ లాయిఫ్ (30) ను ముగ్గురు స్నేహితులు అత్తాపూర్ PVNR పిల్లర్ నెంబర్ 258 వద్దకు మద్యం తాగేందుకు తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో గాని మద్యం సీసాలు పగులగొట్టి అతడిని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్,ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పాతకక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.