భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో డ్రైవింగ్​లో గుండెపోటుతో లారీ డ్రైవర్​ మృతి

పాల్వంచ రూరల్, వెలుగు : డ్రైవింగ్​లో ఉండగా గుండెపోటుతో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఓ లారీ డ్రైవర్​మృతి చెందాడు. పాల్వంచ ఎస్సై కార్తీక్​వివరాల ప్రకారం.. ఖమ్మంజిల్లా బసవాపురానికి చెందిన ముప్పారపు శ్రీనివాసరావు(55) రెండు రోజుల కింద లారీలో సుబాబుల్​కర్ర లోడు చేసుకుని భద్రాచలం వెళ్లాడు.

అన్​లోడ్​చేశాక తిరిగి వెళ్తుండగా పాల్వంచ మండలం రంగాపురం శివారులో శ్రీనివాసరావుకు గుండెపోటు వచ్చింది. లారీ రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవింగ్​సీటులోనే శ్రీనివాసరావు చనిపోయాడు. మృతుని భార్య జయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.