మౌలాలి ఫ్లైఓవర్ వద్ద జీహెచ్ఎంసీ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం.. జూన్30న లాలాపేట్ నుంచి మౌలాలి వైపు ఫ్లై ఓవర్ మీదుగా వెళ్తున్న ఓ లారీ ఓవర్ స్పీడ్‌తో వచ్చింది. దీంతో అదుపు తప్పి రాంగ్రూట్లో వెళ్లి పలు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసం కాగా.. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని ఆసుపత్రికి తరలించారు.
వారి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. డివైడర్, కరెంట్ స్తంభం తదితర వస్తువులు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతను మద్యం మత్తులో ఉన్నాడా.. లేదా మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ జామ్ అయింది. వివిధ పనులకు వెళ్లే వారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఇబ్బంది పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.