ఫేక్ నంబర్ ప్లేట్ తో మోసగించిన లారీ డ్రైవర్.. నిర్మల్ జిల్లాలో మొక్క జొన్న లోడ్తో పరార్

ఫేక్ నంబర్ ప్లేట్ తో   మోసగించిన లారీ డ్రైవర్.. నిర్మల్ జిల్లాలో మొక్క జొన్న లోడ్తో పరార్

కుంటాల, వెలుగు: ఫేక్ నంబర్ ప్లేట్ లారీతో మొక్క జొన్న వ్యాపారిని బురిడీ కొట్టించి డ్రైవర్​పరారైన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. బాధిత వ్యాపారి తెలిపిన మేరకు.. కుంటాల మండలం కల్లూరు గ్రామానికి చెందిన బి.శ్రీనివాస్ గ్రామాల్లో రైతుల వద్ద మక్కలు కొని మెదక్, తూప్రాన్ ప్రాంతాల్లో అమ్ముతుంటాడు. ఈనెల23న కల్లూరులో లారీ( TS 28 TD 4649)లో రూ.7.50 లక్షల విలువైన మక్కలను లోడ్ చేసి పంపించారు. 

అయితే.. వ్యాపారి చెప్పిన ప్రాంతానికి లారీ వెళ్లలేదు. మూడు రోజులుగా డ్రైవర్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది. నంబర్ ప్లేట్ ఆధారంగా సెర్చ్ చేసి.. లారీని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డికి చెందినదిగా గుర్తించి అక్కడికి వెళ్లి వాకబు చేశారు. ఆ నంబర్ లారీ బయట ప్రాంతాలకు వెళ్లలేదని ఓనర్ చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన వ్యాపారి ఆదివారం కుంటాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ 
తెలిపారు..