
కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఉదయం శ్రీశైలానికి బయలుదేరాడు. ఉప్పల్ చౌరస్తా వద్దకు రాగానే సిగ్నల్ పడటంతో కారును ఆపాడు. గ్రీన్ సిగ్నల్ పడగానే కారుకు కుడివైపున్న లారీ ఒక్కసారిగా దూసుకొచ్చింది. వీరి కారును ఢీకొట్టి కొద్దిదూరం ముందుకు తీసుకెళ్లింది.
అప్పటికే కారు కుడిభాగం దెబ్బతింది. అయితే, కారులో సతీ శ్తో పాటు మరో ఇద్దరు కుటుంబసభ్యులు, పాప ఉంది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు లారీ డ్రైవర్ భిక్షపతిపై కేసు ఫైల్ చేశారు. దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరగడంతో సతీశ్ కుటుంబం శ్రీశైలం ప్రయా
ణాన్ని రద్దు చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది.