భిక్కనూరు, వెలుగు : భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో టోల్‌గేట్ బూత్‌రూంతో పాటు అందులో ఉన్న కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నాగపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు టోల్‌గేట్ బూత్ రూంను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న బాబు అనే వ్యక్తికి గాయాలు కాగా.. బాల్ రెడ్డి అనే వ్యక్తి తప్పించుకోవడంతో ప్రాణపాయం తప్పింది.