- తప్పిన పెను ప్రమాదం
ఖమ్మం టౌన్, వెలుగు : స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఇద్దరి స్టూడెంట్స్కు గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి వద్ద శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం సిటీలోని కాకతీయ స్కూల్ పిల్లలను ఇంటికి తీసుకెళ్లే క్రమంలో టేకులపల్లి వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా సిగ్నల్ వేయకపోవడం, సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన లారీ స్కూల్ బస్సును ఢీ కొట్టింది.
ఆ సమయంలో బస్సులో 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారిలో ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్కూల్ బస్సును, లారీని స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.