హైదరాబాద్ హబ్సీగూడలో లారీ బీభత్సం సృష్టించింది. హబ్సీ గూడ నుంచి నాచారం వెళ్లే ప్రధాన రహదారిపై గ్యాస్ సిలిండర్ల లారీ చిరు వ్యాపారుల దుకాణాలపై దూసుకెళ్లింది. కూరగాయల బండ్లు,దుకాణాలు ధ్వంసం అయ్యాయి.
ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే డ్రైవర్ కి ఫిట్స్ రావడంతో వాహనం అదుపు తప్పింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.