
హైదరాబాద్ కూకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూకట్ పల్లి-ముంబై రహదారిపై లారీ అతివేగానికి ఒకరు బలయ్యారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్ వద్ద కంటైనర్ లారీ స్కూటీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
మెట్రో పిల్లర్ నెంబర్ ఏ 681 వద్ద స్కూటీని కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. తలపై నుండి లారీ వెళ్లడంతోనే ఆ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మృతి చెందిన వ్యక్తి ఫణి రంజన్(45) గా గుర్తించారు. డిజిటల్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
ALSO READ | దారుణం: బైక్ పై వచ్చి నడిరోడ్డుపైనే కిరాతకంగా కాల్చి చంపారు..