ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 10మందికి తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో టాటా ఏసీ వాహనాన్ని  ఓ లారీ ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో  టాటా ఏసీలో ప్రయాణిస్తున్నవారిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

 సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక  చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన హనుమంతు ఆనందరావు(45), హనుమంతుశేఖర్(15), చింతాడి ఇందు(65)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పెందుర్తి పోలీసులు చెప్పారు.

ALSO READ : ఫోన్ ట్యాపింగ్ కేసు.. చంచల్ గూడ జైలు నుంచి పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు