హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి నుండి కోకాపేట వెళ్లే ఔటర్ రింగ్ రోడ్ పై ముందు వెళ్తున్న టిప్పర్ ను వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి ఢీ కొట్టింది. దీంతో డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. కాపాడాలని ఆర్థనాదాలు చేశాడు డ్రైవర్. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్రేన్ తో డ్రైవర్ ను బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు. అయితే, తీవ్రగాయాలు కావడంతో డ్రైవర్ చనిపోయాడు. డ్రైవర్ నిద్రమత్తులో జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.