పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎఫ్ సీఐ సెంటర్ సిగ్నల్స్ దగ్గర వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి ముందున్న కారును ఢీకొట్టింది. దీంతో కారు.. దాని ముందున్న ఆర్టీసీ బస్సు వెనక భాగం కింద చిక్కుకుని నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో కారులో ఉన్న పలువురికి గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జిల్లాలోని సుల్తానాబాద్ పట్టణంలోనూ ఓ లారీ బీభత్సం సృష్టించింది. పెద్దపెల్లి రాజీవ్ రహదారిపై లారీ డ్రైవర్ మద్యం మత్తులో పూసల రోడ్డు నుంచి బస్టాండ్ వరకు బైక్ లను ఢీకొంటూ దూసుకెళ్లాడు. డివైడర్ మీది నుండి రోడ్డుకు అటు ఇటు నడుపుతూ షాపు ఆవరణాలను ధ్వంసుకుంటూ.. బస్టాండ్ దగ్గరలో ఉన్న వేప చెట్టుకు ఢీకొని లారీ ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పజెప్పారు.