తిమ్మాపూర్లో కారును తప్పించబోయి.. డివైడర్ ఎక్కిన లారీ

తిమ్మాపూర్, వెలుగు: యూటర్న్​తీసుకుంటున్న కారును తప్పించబోయి లారీ అదుపుతప్పి డివైడర్​ఎక్కింది. గురువారం ఓ లారీ రైలు పట్టాల లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్తోంది. సిటీలో అలుగునూర్ నుంచి మున్సిపల్ ఆఫీస్​వద్ద కారు యూటర్న్ తీసుకుంటుండగా లారీ డ్రైవర్​బ్రేకులు వేయడంతో డివైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టి పైకెక్కింది. ఈప్రమాదంలో లారీ నుజ్జయింది.

లారీలో ఉన్న రైల్వే పట్టాలు రోడ్డుపై పడడంతో సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ స్తంభించింది. డ్రైవర్ రామ్ కుమార్ వర్మకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతడిని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. రోడ్డుపై పడిన రైల్వేపట్టాలను క్రేన్​ సాయంతో పోలీసులు తొలగించి ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్లియర్​చేశారు.