నవీపేట్, వెలుగు : మండల కేంద్రం లోని రైల్వే గేట్ వద్ద గురువారం రాత్రి లారీ బోల్తా పడింది. గురువారం నుంచి రైల్వే గేటు వద్ద మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో నిజామాబాద్నుంచి వచ్చే వాహనాలను శివాజీ చౌరస్తా, కల్యాపూర్, సాట పూర్, బోర్గం, తాడ్ బిలోలి, ఫకీరాబాద్ మీదుగా బైంసా, ధర్మాబాద్ కు మళ్లించారు.
అయితే లారీ డ్రైవర్ గురువారం రాత్రి రైల్వే గేట్ సమీప రెండో రైల్వే లైన్ కోసం ఏర్పాటు చేస్తున్న రూట్లోని అహ్మద్ పుర కాలనీ వైపు మల్లించడం తో లారీ బోల్తా పడింది. ఎస్ఐ ను వివరణ కోరగా ఘటన పై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.