- రోడ్డు మీద పడ్డ పాల ప్యాకెట్లు.. ట్రాఫిక్ కు అంతరాయం
కూకట్పల్లి: కూకట్పల్లి మెయిన్ రోడ్డుపై గురువారం రాత్రి ఓ పాల లారీ బోల్తా పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కూకట్పల్లి నుంచి కేపీహెచ్బీకి వస్తున్న ఓ పాల లారీ.. టైర్ పేలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న పాల ప్యాకెట్లు రోడ్డు మీద పడగా.. కొంత సమయం పాటు అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం కల్గింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని రోడ్డు మీద నుంచి తొలగించి.. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం: