
జనగామ జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది.. వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేపై ఉన్న కోమల్ల టోల్ గేట్ దగ్గర మితిమీరిన వేగంతో వచ్చిన లారీ టోల్ గేట్ క్యాబిన్ లోకి దూసుకెళ్లింది. శనివారం ( ఏప్రిల్ 19 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కోమల్ల టోల్ గేట్ దగ్గర మితిమీరిన వేగంతో వచ్చిన ఓ లారీ అదుపుతప్పి టోల్ గేట్ క్యాబిన్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో టోల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
జనగామ జిల్లాలో లారీ బీభత్సం.. టోల్ గేట్ క్యాబిన్ లోకి దూసుకెళ్లిన లారీ... pic.twitter.com/lwrsIfK6Em
— Prashanth (@itzmibadboi) April 19, 2025
లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో టోల్ గేట్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది.. ఈ ప్రమాదంలో గాయపడ్డ టోల్ గేట్ సిబ్బందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
►ALSO READ | గ్రేటర్లో హైడ్రా దూకుడు.. మియాపూర్, తుర్క యంజాల్లో అక్రమ నిర్మాణాల నేలమట్టం