మెట్‌పల్లి, వెలుగు : ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకుని సీజ్ చేసినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆదివారం ఉదయం బస్ డిపో వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా పర్మిషన్ లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు.
డ్రైవర్‌ను విచారించగా కథలాపూర్ నుంచి నిజామాబాద్‌కు ఇసుక తరలిస్తున్నట్లు చెప్పినట్లు సీఐ తెలిపారు. డ్రైవర్, లారీ ఓనర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.