హైదరాబాద్ పాతబస్తీలో లారీ షెడ్ దగ్ధం

హైదరాబాద్ పాతబస్తీలో లారీ షెడ్ దగ్ధం

చార్మినార్/కీసర, వెలుగు: పాతబస్తీలోని బహదూర్ పురా మొహమ్మది హాస్పిటల్ సమీపంలోని ఓ లారీ షెడ్​గురువారం సాయంత్రం దగ్ధమైంది. దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్​సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు. 

ప్రమాదం పై విచారణ చేపట్టామని బహదూర్ పురా పోలీసులు తెలిపారు. ఈ షెడ్ లో లారీ పార్టులు విడతీసేందుకు గ్యాస్​కట్టర్లు, సిలిండర్లు వాడుతుంటారు. గతంలోనూ ఇలాగే ఓసారి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా షెడ్​ను తొలగించాలని కోరుతున్నారు. కీసర గుట్ట కమాన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. 

ఆకతాయిలు నిప్పు పెట్టడంతో ప్రమాదం జరిగిందని అటవీ అధికారి ఇంద్రాసేనారెడ్డి తెలిపారు. మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.