లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు : 24 మంది మృతి, 12 వేల ఇండ్లు బూడిద

అమెరికాలోని లాస్ ఏంజెస్ లో కార్చిచ్చు ఆగడం లేదు.  కార్చిచ్చు కారణంగా మృతుల సంఖ్య  24కు చేరిందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.  మొత్తం 12 వేల నిర్మాణాలు బూడిద అయినట్లు వెల్లడించారు. బాధితుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందన్న అధికారులు ..మిస్సయిన వాళ్ల కోసం రిపోర్టు చేసేందుకు సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. 

 పాలిసేడ్స్, ఈటన్, కెన్నెత్ ఫైర్ కలిపి మొత్తం 39,680 ఎకరాలను కాలిబూడిద చేశాయి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో ఏరియా కంటే ఎక్కువ. ఇందులో పాలిసేడ్స్, ఈటన్ ఫైర్స్ తోనే 37,760 ఎకరాలు కాలిబూడిదైంది. పాలిసేడ్ ఫైర్ ను 11 శాతం, ఈటన్ ఫైర్ ను 15 శాతం అదుపు చేయగలిగినట్టు అధికారులు తెలిపారు. 

జనవరి 13  నుంచి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే చాన్స్ ఉంది” అని కాలిఫోర్నియా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆఫీసర్ మైఖేల్ ట్రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని లాస్ ఏంజెలిస్ కౌంటీలోని 1.50 లక్షల మందికి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. 9 షెల్టర్లలో 700 మంది ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. ‘‘అమెరికాలోని 10 రాష్ట్రాలతో పాటు మెక్సికో ఫైర్ ఫైటర్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మొత్తం 14 వేల మందికి పైగా సిబ్బంది ఫీల్డ్​లో ఉన్నారు. 1,354 ఫైర్ ఇంజిన్లు, 84 విమానాలను వినియోగిస్తున్నారు” అని వెల్లడించారు.