యూనికార్న్‌‌‌‌‌‌‌‌లకు నష్టాలే!

యూనికార్న్‌‌‌‌‌‌‌‌లకు నష్టాలే!

51 యూనికార్న్‌‌‌‌‌‌‌‌ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లలో  ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌ సాధించినవి ఆరే

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : దేశంలోని యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నష్టాలు వెంటాడుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఎంసీఏ) దగ్గర రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైల్ చేసిన 51 యూనికార్న్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కేవలం ఆరు కంపెనీలు మాత్రమే 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను లాభాలు సాధించాయి.   కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్లను ఆకర్షించిన టెక్ ఆధారిత కంపెనీలు, గత కొన్ని ఆర్థిక సంవత్సరాలుగా  నష్టాల్లో నడుస్తున్నాయి. మెజార్టీ యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తమ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భారీగా విస్తరించాయి. దీంతో వీటి రెవెన్యూ, ఖర్చులు విపరీతంగా పెరిగాయి.  2020–21  ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లాభాలు ప్రకటించగా, కిందటి ఆర్థిక సంవత్సరంలో మూడు స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి జారుకున్నాయి. ఈ 51 యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల లిస్టులో జొమాటో,పేటీఎం, డెల్హివరీ వంటి లిస్టెడ్ యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కలిసిలేవు. అలానే జెరోధా, జోహో వంటి  ఇప్పటి వరకు బయట నుంచి ఫండింగ్ సేకరించని కంపెనీలూ కలిసి లేవు. టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వీటిని యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లని అనలేము. రెగ్యులేటరీ ఫైలింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ప్రైవేట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మీడియా రిపోర్ట్స్ ఆధారంగా మనీకంట్రోల్ ఈ డేటాను రెడీ చేసింది.

రూ.100 కోట్లకు పైన లాభం రెండింటికే..

ఈ 51 యూనికార్న్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో  కేవలం ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే 2021–22 లో రూ.200 కోట్ల మార్క్ దాటింది. చిన్న కంపెనీలు, బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రామెటీరియల్స్ అందించే ఈ కంపెనీ కిందటి ఆర్థిక సంవత్సరం రూ.201 కోట్ల లాభాన్ని సాధించింది. ఈ యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టైగర్ గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆల్ఫా వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి పెద్ద ఇన్వెస్టర్లు డబ్బులు పెట్టారు.  2020–21 లో ఈ కంపెనీ రూ.55.7 కోట్ల ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించింది. కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బిజినెస్ చేస్తున్న ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాడాట్‌‌మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కిందటి ఆర్థిక సంవత్సరం రూ.186 కోట్ల ప్రాఫిట్ సాధించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి రూ.36 కోట్ల ప్రాఫిట్ వచ్చింది.  మిగిలిన యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఫిజిక్స్‌‌వాలా ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.6.93 కోట్ల నుంచి రూ.97.8 కోట్లకు పెరిగింది. 2020–21 లో రూ.281.8 కోట్ల లాస్ ప్రకటించిన యూనిఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.33.5 కోట్ల లాభాన్ని ప్రకటించింది.  మామాఎర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.29 కోట్ల నుంచి రూ.14.4 కోట్లకు తగ్గింది. బ్రౌజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాక్ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 47.9 కోట్ల నుంచి రూ.75.3 కోట్లకు పెరిగింది. 2020–21 లో ప్రాఫిట్ సాధించిన షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 24x7, ఫ్రాక్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  2021–22 లో నష్టాల్లోకి జారుకున్నాయి. 

నష్టాలే నష్టాలు..

మెజార్టీ యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 2021–22 లో భారీ నష్టాలను ప్రకటించాయి.  భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే నష్టం రూ. 5,600 కోట్లకు పెరిగింది. ఇందులో వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖర్చు రూ.5,000 కోట్లు కలిసి ఉంది. ఫార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈజీ, షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉడాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్విగ్గీ, మీషో, డైలీహంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే,  వంటి యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రూ. 2 వేల కోట్లకు పైనే నష్టం మూటకట్టుకున్నాయి. ఒక్క ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాలా మినహా మిగిలిన ఐదు ఎడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  లాభపడలేదు. అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అకాడమీ, అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేదాంతు వంటి యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు భారీగా పెరిగాయి. ఈ కంపెనీలు తమ మార్కెటింగ్, ఉద్యోగుల ఖర్చులను పెంచడమే ఇందుకు కారణం.

కొత్తగా 1,300 స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు..

కిందటేడాది కొత్తగా 1,300 స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు క్రియేట్ అయ్యాయని నాస్కామ్ ఓ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. దేశంలో యాక్టివ్ టెక్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు 27 వేలకు చేరుకున్నా యని తెలిపింది. దీంతో యూఎస్‌‌‌‌‌‌‌‌, చైనా తర్వాత ఎక్కువ టెక్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు ఉన్న దేశంగా ఇండియా  కొనసాగు తోందని పేర్కొంది. అంతేకాకుండా కిందటేడాది 23 యూనికార్న్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు క్రియేట్ అయ్యాయని నాస్కామ్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ వెల్లడించింది. స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు 18.2 బిలియన్ డాలర్ల  ఫండింగ్‌‌‌‌‌‌‌‌ను సేకరించాయని, 2021 లో వచ్చిన ఫండింగ్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఇది  30 శాతం తక్కువని తెలిపింది. 1,400 స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు కిందటేడాది ఫండింగ్ అందుకున్నాయని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ నెంబర్ 18 శాతం ఎక్కువని వివరించింది.

రెవెన్యూ జూమ్‌‌‌‌‌‌‌‌..

51 యూనికార్న్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లలో  బ్లాక్‌‌‌‌‌‌‌‌బక్స్‌‌‌‌‌‌‌‌, గేమ్స్ 24x7  మినహా మిగిలిన యూనికార్న్‌‌‌‌‌‌‌‌ల రెవెన్యూ 2021–22 లో పెరిగింది.  బ్రోకరేజి కంపెనీ గ్రో రెవెన్యూ  రూ.30 కోట్ల నుంచి రూ.350 కోట్లకు పెరిగింది. ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌వాలా, వన్‌‌‌‌‌‌‌‌కార్డ్‌‌‌‌‌‌‌‌, క్రెడ్‌‌‌‌‌‌‌‌అవెన్యూ, డీల్‌‌‌‌‌‌‌‌షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మీషో, జెట్‌‌‌‌‌‌‌‌వెర్క్‌‌‌‌‌‌‌‌, ఆఫ్‌‌‌‌‌‌‌‌బిజినెస్‌‌‌‌‌‌‌‌ల  రెవెన్యూ గ్రోత్‌‌‌‌‌‌‌‌  కిందటి ఆర్థిక సంవత్సరంలో భారీగా దూసుకుపోయింది. సెక్టార్ల పరంగా చూస్తే, ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ యూనికార్న్‌‌‌‌‌‌‌‌లు ఎక్కువ రెవెన్యూ గ్రోత్ నమోదుచేశాయి.  బీ2బీ ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఉడాన్ రెవెన్యూ మిగిలిన యూనికార్న్‌‌‌‌‌‌‌‌ల కంటే ఎక్కువగా రికార్డయ్యింది. ఈ కంపెనీ రెవెన్యూ  రూ.9,885 కోట్లుగా ఉంది. మరో 19 యూనికార్న్‌‌‌‌‌‌‌‌లు కూడా 2021–22 లో రూ. వెయ్యి కోట్ల కంటే ఎక్కువ రెవెన్యూని ప్రకటించాయి.