నెక్కొండ, వెలుగు: ఆన్‌లైన్ గేమ్‌కు యువ కుడు బలైన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్‌రావుపేటలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన బాషబోయిన కమలాకర్, స్వప్న దంపతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఇటీవల వడ్లు అమ్మగా వచ్చిన రూ.50 వేలు స్వప్న బ్యాంక్ అకౌంట్‌లో జమ అయ్యాయి.
కాగా, శుక్రవారం అర్ధరాత్రి కమలాకర్ చిన్న కొడుకు ఉదయ్ (20) వాళ్ల అమ్మ మొబైల్ ఫోన్ తీసుకొని ఆన్‌లైన్‌లో రమ్మి గేమ్ ఆడి, రూ.46 వేలు పోగొట్టాడు. దీంతో తల్లిదండ్రులు తిడతారని భయపడి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.