Telangana kitchen: బోడ కాకరకాయతో బోలెడన్నీ రుచులు..

Telangana kitchen: బోడ కాకరకాయతో బోలెడన్నీ రుచులు..

వర్షాకాలం సీజన్లో ఎక్కువగా కనిపిస్తుంది ఆకాకరకాయ. సైజ్​ చిన్నగానే ఉంటుంది. కానీ టేస్ట్​ మాత్రం చాలా ఎక్కువే. ఈ కూరగాయతో మటన్​ కాంబినేషన్ కూడా ట్రై చేశారా? ఊరగాయ పెట్టుకున్నారా? ఇప్పటివరకు ట్రై చేయకపోతే వెంటనే ట్రై అండ్​ బైట్​ఇట్​.

బోడ కాకర, మటన్ కర్రీ

కావాల్సినవి :

మటన్ - కిలో; ఆకాకరకాయ - అర కిలో 

 ఉల్లిగడ్డలు - నాలుగు  టొమాటోలు - మూడు

కొత్తిమీర - సరిపడా; పుదీనా - కొంచెం

అల్లం, వెల్లుల్లి పేస్ట్ - మూడు స్పూన్లు ; యాలకులు - ఐదు 

దాల్చిన చెక్క - ఒకటి ; లవంగాలు - ఆరు  

నూనె - నాలుగు టీస్పూన్లు,  పసుపు - ఒక టీస్పూన్

కారం - మూడు టీస్పూన్లు ; ఉప్పు, నీళ్లు - సరిపడా 

గరం మసాల, ధనియాల పొడి - ఒక్కో టేబుల్ స్పూన్​ చొప్పున

తయారీ :
నూనె వేడి చేసి అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేగించాలి. అవి వేగాక పొడవుగా, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ తరుగు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేవరకు వేగించాలి. 

ఆపై టొమాటో ముక్కలు, పుదీనా వేసి కలపాలి. టొమాటోలు సగం ఉడికాక శుభ్రం చేసిన మటన్ ముక్కలు అందులో వేసి కలపాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు కూడా వేసి మరోసారి అన్నింటినీ బాగా కలపాలి. 

అందులో నీళ్లు పోసి మరోసారి కలిపి మూతపెట్టి దాదాపు 20 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఆకాకరకాయ ముక్కల్ని కూడా అందులో కలపాలి. మూతపెట్టి మరో పది నిమిషాలు ఉడికించాక ధనియాలపొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి, ఓ మూడు నిమిషాలు ఉడికించాలి. వేడి వేడి మటన్ - ఆకాకరకాయ కూర రెడీ.