బండ్ల సైలెన్సర్లు మార్చి జనాలను ఇబ్బందులకు గురి చేస్తే.. సీరియస్ యాక్షన్ తీసుకుంటాని హనుమకొండ ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు హెచ్చరించారు. హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న దాదాపు 150 సెలెన్సర్లను మంగళవారం రోడ్డు రోలర్ తో తొక్కించారు. వాహనచట్టంలోని నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బైక్ యజమానులను హెచ్చరించారు.