29 మిల్లీ మీటర్ల సముద్ర పురుగు..157 డెసిబల్స్ సౌండు సౌండ్ పొల్యూషన్ చాలా డేంజర్ . వినాల్సిన పరిధికి మించి కాస్త ఎక్కువైనా పిచ్చెక్కిపోతుంది. కర్ణభేరి పగిలిపోతుంది. చెవుల్లోంచి రక్తమొచ్చేస్తుంది. అలాంటి సౌండ్స్ ఏ పెద్ద పెద్ద మెషీన్లో, విమానాలో, రాకెట్లో చేస్తాయనుకోండి. కానీ సైంటిస్టులు ఈ మధ్య విచిత్రమైన విషయాన్ని కనుగొన్నారు. సముద్రంలో ఉండే 29 మి ల్లీమీటర్ల చిన్న పురుగు కర్ణభేరి వాచిపోయేలా అరుస్తుందని గుర్తించారు. దాని పేరు లి యోక్రటైడ్స్ కిమురావోరం. ఇంతవరకు ఈ పురుగులు సౌండ్ చేయకుండా ఉంటాయ నుకున్నా మని , కానీ సు మారు 157 డెసిబల్స్ సౌండ్ చే స్తాయని ఈమధ్యే తెలుసుకున్నా మని క్యోటో వర్ సిటీకి చెం దిన మెరైన్ బయాలజిస్టు ర్యుటారో గోటో చె ప్పారు.
మనిషి చెవులు తక్కువలో తక్కువ 10 డెసిబల్స్ ను గుర్తించగలవని, సౌండ్ 130 డెసిబల్స్ దాటిం దంటే చెవులు పగి లిపోతాయని, ఈ పురుగేమో అంతకుమించి సౌండ్ చే యగలదని వివరిం చారు. సాధారణంగా ఇలాంటి సాఫ్ట్ బాడీ పురుగులు పెద్ద సౌండ్లు చేయవని చెప్పారు. నోటితో దాడి చే సేటప్పుడు, వాటి కమ్యూనికేషన్ లో భాగం గానూ ఇవి సౌండ్ చేస్తుండొచ్చని చె బుతున్నారు. వాటి గొంతులోని గట్టి కండరాలను తెరిచి ఇలాంటి పెద్ద సౌండ్ ను సృష్టి స్తాయని భావిస్తున్నారు. జపాన్ తీరంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. అక్కడి సీ స్పాం జుల్లో రంధ్రాలు చేసు కొని ఆహారం కో సం ఓ కంట కనిపెట్టు కొని ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద బయలాజికల్ శబ్దా లను ‘స్నాపింగ్ ష్రింప్స్ ’ చేస్తాయి. వాటి ఆహారాన్ని పట్టు కోడానికి 189 డెసిబల్స్ సౌండ్ ను సృష్టి స్తాయి. ఆ దెబ్బకు ముందున్న జీవులు ఒక్కసా రిగా ఆగిపోతాయి. మరి ఈ సౌండ్ ఫోర్స్ ఎంతో తెలుసా . గాజు గ్లాసు పగిలిపోద్ది.